తెలంగాణలో పెరిగిన నేరాలు.. 175 వరకట్న చావులు!

by Sumithra |   ( Updated:2021-09-15 01:33:19.0  )
తెలంగాణలో పెరిగిన నేరాలు.. 175 వరకట్న చావులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నేరాలు గతేడాది -2019 కంటే ఈ సంవత్సరం -2020 వరకు 12% పెరిగాయి. గతేడాది మొత్తం నేరాలు 1,31,254 నమోదైతే ఈసారి అది 1,47,504కు పెరిగింది. అత్యధిక నేరాల్లో దేశం 13వ స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో హత్యలు ఈ ఏడాది 802 నమోదు కాగా, అందులో ఎక్కువ భాగం వివాహేతర సంబంధాలు, కుటుంబ సంబంధాల్లో ఘర్షణలే కారణమని ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన తాజా రిపోర్టులో తేలింది.

గతేడాది మహిళలపై 17,791 నేరాలు నమోదవ్వగా.. దేశం మొత్తం మీద మహిళలపై నేరాల విషయంలో అధిక కేసులతో తెలంగాణ ఏడవ స్థానంలో నిలిచింది. 175 మంది మహిళలు వరకట్న బాధలకు గురై తనువు చాలించారు. భర్తలు, వారి తరఫు బంధువుల వేధింపులకు 7,745 మంది మహిళలు గురైనట్లు తేలింది. మొత్తం 1,341 మంది మహిళలు కిడ్నాప్‌కు గురయ్యారు. రాష్ట్రంలో 765 మంది మహిళలు అత్యాచార బాధితులుగా మిగిలారు. పని స్థలాలతో పాటు ఇతర చోట్ల 737 మంది లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇందులో 21 మంది ఆర్టీసీ బస్సుల్లోనే వేధింపులకు గురైనట్టు తేలింది.

Advertisement

Next Story

Most Viewed