- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
17 ఏళ్ళ విద్యార్థి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు తగినంత సంఖ్యలో సిబ్బంది సమకూరకపోవడంతో ‘ఆశా’ వర్కర్లను, ఏఎన్ఎంలను రంగంలోకి దించినట్లుగానే 17 ఏళ్ళ విద్యార్థులను కూడా నియమించింది. సంతోష్‌నగర్ సర్కల్‌లోని ఐఎస్ సదన్ డివిజన్ (నెం. 38)లో ఉన్న 24వ నెంబరు పోలింగ్ స్టేషన్‌లో 17 ఏళ్ళ ఏ.వరుణ్‌సాగర్ అనే విద్యార్థిని అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా జీహెచ్ఎంసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించాయి. ఆ విద్యార్థికి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పేరుతో జారీ చేసిన ఎలక్షన్ పాస్ (ఐడెంటిటీ కార్డు)లో కూడా ‘విద్యార్థి’ అని పేర్కొన్నాయి.
కనీస ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా ఎన్నికల విధుల్లో నియమించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక మైనర్ బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించడాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకుని తగిన విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో విద్యార్థులను కూడా అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా నియమించడం సిగ్గుచేటు అని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, జీహెచ్ఎంసీ అధికారులను తప్పుపట్టారు.