నరకం నుంచి నగరానికి..

by Shyam |
నరకం నుంచి నగరానికి..
X

చేరుకున్నారు. శనివారం ఉదయం శంషాబాద్ చేరుకున్నవలస కార్మికులు తమ కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మూడెండ్ల కిందట బతుకు దెరువు కోసం ఇరాక్ వెళ్లి అక్కడ ప్రభుత్వం పెట్టే కష్టాలు భరించలేక సోషల్ మీడియా వేదిక తమను తిరిగి ఇండియాకు వచ్చేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. స్పందించిన ఆయన కేంద్రంలోని విదేశీ వ్యవహారాల అధికారులతో మాట్లాడి చొరవ తీసుకున్నట్టు సమాచారం. దీంతో వారంతా క్షేమంగా ఇండియాలో అడుగుపెట్టడంతో వారి కళ్లల్లో ఆనందం వెల్లివిరసింది. మూడెళ్లు సరైన పనిలేక, తిండి లేక అరిగోస పడ్డామని వలస కార్మికులు తమ గోడును మీడియాకు వెల్లబోసుకున్నారు. తాము కోరగానే సాయం చేసిన మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌కు,ఎన్ఆర్ఐ అధికారులకు రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు.

Advertisement

Next Story