ఒక్క రోజే 16,922 మందికి కరోనా

by vinod kumar |
ఒక్క రోజే 16,922 మందికి కరోనా
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేవలం 24 గంటల్లోనే 16,922 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికమవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ బులిటిన్‌ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,73,105కు చేరింది. 24 గంటల్లోనే కరోనాతో దేశవ్యాప్తంగా 418 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 14,894కి పెరిగింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 2,71,189 మంది కోలుకోగా 1,86,514 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 4,841 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్త కేసుల సంఖ్య 1,47,741కు చేరింది. మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 192 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,931కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 3,390 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 73,780కు చేరింది. ఇక్కడ ఒక్కరోజులోనే 64 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2,429కి చేరింది. తమిళనాడులో ఒక్కరోజే 3,509 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య70,977కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 45మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 911కు చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 577కొత్త పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 29,578కి చేరింది. ఇక్కడ ఒక్కరోజే 18 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,754కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 553కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 10,884కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా ఏడుగురు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 136 మంది మరణించారు.

Advertisement

Next Story

Most Viewed