ఏపీలో కరోనా @ 1650

by srinivas |
coronavirus
X

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న 58 మందికి కరోనా సోకితే.. గడచిన 24 గంటల్లో 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీలో కర్నూలు జిల్లా కరోనా కేసులకి రాజధానిలా తయారైంది. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నిన్న 30 కేసులతో నేడు 25 కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలు అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 500కి చేరువైంది. ప్రస్తుతం ఈ జిల్లాలో 491 మందికి కరోనా సోకితే 395 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 86 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 10 మంది మృత్యువాత పడ్డారు.

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో 338 కేసులు నమోదయ్యాయి. 115 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయితే 215 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో కూడా కరోనా కట్టడి కావడం లేదు. ఇక్కడ 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 278కి చేరుకుంది. 224 మంది చికిత్స పొందుతుంటే, 46 మంది కోలుకున్నారు. 8 మంది మరణించారు.

చిత్తూరులో 1, కపడలో 4, విశాఖపట్నంలో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,650కి చేరుకుంది. వారిలో ఇప్పటివరకు 524 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. 1,093 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 1,25,229 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Tags: coronavirus, corona positive, covid-19, corona in ap, ap health department

Advertisement

Next Story

Most Viewed