- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచిర్యాలలో కరోనా విజృంభణ
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బొగ్గు గనుల జిల్లా మంచిర్యాలపై కరోనా విరుచుకుపడింది. మంగళవారం జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయి. సమీప కాలంలో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైరస్ ప్రభావిత తొలిరోజుల్లో మంచిర్యాల జిల్లాకు కరోనా ఫ్రీగా ముద్ర పడింది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత కారణంగా క్రమంగా జిల్లాలో కేసులు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా బొంబాయి నుంచి వలస కూలీల కారణంగా ఈ జిల్లాలో కరోనా ప్రభావం పెరిగింది.
తాజాగా మంగళవారం సుమారు 500 మంది అనుమానితులను కరోనా పరీక్షలు నిర్వహించగా… వీరిలో 160 మందికి పాజిటివ్ తేలినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నీరజ వెల్లడించారు. దీంతో మంచిర్యాల జిల్లా వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింగరేణి కార్మికులు, సిమెంటు, సున్నం బట్టిల కార్మికులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉండటం కారణంగా కరోనా విస్తృతంగా పెరిగిపోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా వైరస్ ఉధృతి పెరుగుతున్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వీటితో కలిపి మొతంగా మంచిర్యాల జిల్లాలో 1600 దాటాయి.