- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ మున్సిపాలిటీలకు రూ.105 కోట్లు
దిశ, న్యూస్‌బ్యూరో: 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోని పట్టణ, స్థానిక సంస్థలకు(యూఎల్‌బీ) రావాల్సిన మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 10 లక్షల జనాభా దాటని పట్టణాలకు మాత్రమే ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.5 వేల కోట్లు విడుదల చేయగా, వీటిలో తెలంగాణలోని 10 లక్షలు జనాభా దాటని మున్సిపాలిటీలకు రూ.105 కోట్లు మంజూరు అయ్యాయి. రాష్ట్రాల ఆర్థిక సంఘాల సిఫారసుల ప్రకారం కంటోన్మెంట్ ప్రాంతాలకు సైతం ఈ నిధులు వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. నిధులు విడుదలైన 10 పని దినాల్లో మున్సిపాలిటీలకు వాటిని కేటాయించాలని లేదంటే వడ్డీతో కలిపి ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిపింది. ఈ వాయిదా నిధులను ముందస్తుగా విడుదల చేస్తున్నట్లు ఆర్థిక సంఘం తెలిపింది. మిగతా వాయిదాల విషయంలో విధివిధానాలు త్వరలో ప్రకటిస్తామని కేంద్రం పేర్కొంది.