ఏపీలో కొత్తగా 1535 కరోనా కేసులు

by srinivas |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,89,296 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో 16 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,631 కి చేరింది. ఇక నిన్న 2075 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 19,57, 455 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18, 210 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో కొంత మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా, మరికొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

Next Story