అమ్మో.. అది ఇళ్లా పాముల పుట్టా

by Shyam |   ( Updated:2021-04-16 02:59:18.0  )
అమ్మో.. అది ఇళ్లా పాముల పుట్టా
X

దిశ, వెబ్ డెస్క్ : సామన్యంగా పల్లెల్లో అప్పుడప్పుడు ఒకటో రెండో పాములు కనిపిస్తాయి వాటిని చంపేస్తారు. అయితే ఈ పాములు ఎక్కువగా వర్షకాలంలో కనిపిస్తుంటాయి. కానీ వర్షాకాలం మొదలవ్వకముందే ఒక ఇంటిలో డజన్ల కొద్ది పాములు బయటపడ్డాయి. వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో సాయంకాలం పూట అందరూ వాకిల్లలో కూర్చుండి ముచ్చట పెడుతున్నారు. అయితే ఆ సమయంలో మూడు రోజుల నుంచి వరసగా పాములు రావడం మొదలైంది. దీంతో ఆ ఇంటి యజమాని ఈ పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయని గమనించగా వారి ఇంటి దగ్గరిలో ని మోరీ నుంచి పాములు వస్తున్నాయని గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా అందులో ఏకంగా 15 పాములు ప్రత్యేక్షమయ్యాయి. వాటిని చూసి భయాందోళనకు గురైన గ్రామస్థులు వాటిని ఒక్కొక్కటిగా తీసి చంపేశారు. దీంతో గ్రామంలోని మిగిలిన మోరీలను కూడ గ్రామస్థులు వెతకడం మొదలు పెట్టారు.

Advertisement

Next Story