- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్‌లో 15 నో మూమెంట్ జోన్లు
దిశ, వరంగల్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 15 ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాలను నో మూవ్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్‌లు ఓ ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలోని జూలై వాడ, సుబేదారి, ఈద్గా, కుమార్ పల్లి, మండి బజార్, పోచమ్మ మైదాన్, చార్ బౌలి, కాశి బుగ్గ, గణేష్ నగర్, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట్, శంభుని పేట్, బాపూజీ నగర్, చింత గట్టు క్యాంపు ప్రాంతాలను నో మూవ్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి గానీ, బయటి నుంచి లోపలికి రావడానికి గానీ అనుమతిలేదని స్పష్టం చేశారు. ఇందుకోసం బారికేడ్లు ఏర్పాటు చేసి 24×7 పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కావున ప్రజలందరూ సహకరించాలని కోరారు. నిత్యావసర సరుకులు, కూరగాయలను మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ జోన్లలోని ప్రజలకు ఏమైనా ఇబ్బందులుంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1115ను సంప్రదించాలని తెలిపారు.
tags: no movement zones, warangal, collector rajiv gandhi hanumanthu, commissioner ravindar, coronavirus,