- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియా ఓపెన్ కొరకు 15 చార్టెడ్ ఫ్లైట్స్
దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మొత్తం టెన్నిస్ టోర్నీలు వాయిదా పడ్డాయి. ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత కరోనా కారణంగా క్రీడలు నిలిచిపోవడంతో టెన్నిస్ క్రీడాకారులు ఇంటికే పరిమితం అయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ కూడా కరోనా నిబంధనల మధ్య జరిగింది. ఇక 2021లో తొలి టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియాలో జరుగనున్నది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్న క్రీడాకారుల కోసం 15 చార్టెడ్ ఫ్లైట్‌లను ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా ఓపెన్ బయోబబుల్ సెక్యూరిటీ మధ్య నిర్వహించనున్నారు.
కాగా, ఇందుకోసం క్వాలిఫయర్ మ్యాచ్‌లు దోహాలో ఏర్పాటు చేశారు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు పూర్తి కావడంతో దోహా నుంచి తొలి చార్టెడ్ ఫ్లైట్ మెల్‌బోర్న్ బయలు దేరింది. ప్రతీ క్రీడాకారుడిని పూర్తిగా టెస్ట్ చేసి కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాతే ఫ్లైట్‌లోకి ఎక్కడానికి అనుమతి ఇచ్చారు. తొలి ఫ్లైట్‌లో మొత్తం 58 మంది ప్యాసింజర్లు ఉండగా.. దానిలో 25 మంది టెన్నిస్ క్రీడాకారులు ఉన్నారు. మెల్‌బోర్న చేరుకున్న తర్వాత క్రీడాకారులు అందరూ 14 రోజుల పాటు హోటల్ రూంలో క్వారంటైన్‌లో ఉండనున్నారు. క్వారంటైన్ సమయంలో వారిని మ్యాచ్ ప్రాక్టీస్‌కు కూడా అనుమతించరని నిర్వాహకులు తెలిపారు. ఇక మిగతా క్రీడాకారుల కోసం సింగపూర్, లాస్ఏంజెలెస్ నుంచి కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. మొత్తం 15 చార్టెడ్ ఫ్లైట్స్ క్రీడాకారులు, అధికారులు, ఇతర సిబ్బందిని తీసుకొని ఆస్ట్రేలియా రానున్నాయి.