రష్మిక ‘పొగరు’ తగ్గింది.. 14 సీన్స్ డిలీట్

by Jakkula Samataha |   ( Updated:2021-02-26 06:36:04.0  )
రష్మిక ‘పొగరు’ తగ్గింది.. 14 సీన్స్ డిలీట్
X

దిశ, సినిమా : ధృవ సర్జా, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘పొగరు’. నంద కిశోర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా తమ మనోభావాలను దెబ్బతీసిందని ఆందోళనకు దిగిన బ్రాహ్మణ సంఘాలు.. పూజారిపై విలన్ కాలు పెట్టే సన్నివేశంతో పాటు మరిన్ని సీన్స్ కూడా డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ జోక్యంతో బ్రాహ్మణ కమ్యూనిటీ, డైరెక్టర్ నంద కిశోర్ ఒప్పందానికి వచ్చారు. బ్రాహ్మణ సంఘాల డిమాండ్ మేరకు సినిమాలో సీన్లను తొలగించేందుకు అంగీకరించారు. శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్‌పై బీకే గంగాధర్ నిర్మాణంలో వచ్చిన సినిమా ఫిబ్రవరి 19న రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కోలీవుడ్, టాలీవుడ్‌లో ధృవ సర్జాకు డెబ్యూ మూవీ కావడం విశేషం.

Advertisement

Next Story