ఎంజీఎంలో పోతున్న ప్రాణాలు.. మా వల్ల కాదంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్..!

by vinod kumar |   ( Updated:2021-04-19 01:25:51.0  )
ఎంజీఎంలో పోతున్న ప్రాణాలు.. మా వల్ల కాదంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ విజృంభిస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు కరోనా నిద్రలేకుండా చేస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలో రోజురోజుకూ కరోనా రోగుల తాకిడి ఎక్కువ అవుతోంది. దీనికి తోడు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 48 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందారు.

ప్రస్తుతం కొవిడ్ వార్డులో 216 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆస్పత్రి వర్గాలు కూడా భయాందోళనకు గురవుతున్నాయి. ఇదిలాఉండగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు లేక కొవిడ్ రోగులను చేర్చుకునేందుకు యాజమాన్యాలు వెనకాడుతున్నాయి. మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed