- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెడ్ రెస్ట్‌లో ఉండి కూడా ఫస్ట్ కర్వా చౌత్ జరుపుకున్న స్టార్ హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. నాగార్జున, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ భామ.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో కొన్నేళ్లు ప్రేమలో ఉండి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నది. ఇక భర్తతో రెగ్యులర్‌గా ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అయితే ఆదివారం నార్త్‌లో భార్యాభర్తలు చేసుకునే ఫేమస్ పండుగ కర్వా చౌత్ కావడంతో ఈ ముద్దుగుమ్మ బెడ్ రెస్ట్‌లో ఉండగానే తన ఫస్ట్ కర్వాచౌత్‌ను సెలబ్రేట్ చేసుకుంది. వాటికి సంబంధించిన ఫొటోలను ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా రీసెంట్‌గా ఈ బ్యూటీకి వెన్నుకు గాయం కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా రకూల్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో రకూల్, తన భర్త జాకీ భగ్నానీ ఇద్దరు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని కర్వా చౌత్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ పిక్స్‌కు ఈ ముద్దుగుమ్మ 'నా ‘సూర్యుడు, చంద్రుడు, విశ్వం, నా ప్రతిదీ నువ్వే. మీకు మా నుండి కర్వా చౌత్ శుభాకాంక్షలు' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు ఓ సారి ఆ ఫొటోలను చూసేయండి.
(video link credits to rakul prreth singh instagram id)