- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచిర్యాల జిల్లాలో ఒక్క రోజే 14 కేసులు
దిశ, మంచిర్యాల: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మొన్నటి దాక బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, జన్నారం ప్రాంతాలను వణికించిన వైరస్ ఇప్పుడు జిల్లా కేంద్రానికి పాకింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని ప్రముఖ టెక్స్టైల్ వ్యాపారి కుటుంబంలో ఇద్దరితో పాటు వారి డ్రైవర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఇద్దరు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లా నుంచి మూడు రోజుల క్రితం పంపిన 28 శాంపిల్స్‌లో శనివారం 14 పాజిటివ్‌గా తేలాయి.
హాస్పిటల్ నిర్లక్ష్యంతో 9మందికి..
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో తొమ్మిది మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. ఇటీవల బెల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి ఈ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లగా అక్కడ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసినప్పటికీ బెల్లంపల్లి హాస్పిటల్‌ను యథావిధిగా నిర్వహించారు. దీంతో హాస్పిటల్లో పనిచేసే డాక్టర్‌కు పాజిటివ్ వచ్చింది. అధికారులు హాస్పిటల్‌ను మూసివేసి స్టాఫ్‌కు టెస్టులు నిర్వహించారు. ఏకంగా తొమ్మిది మందికి వైరస్ సోకినట్లు తేలింది.
అలాగే పట్టణంలోని ఓ మెడికల్ షాపు యజమాని ద్వారా ఆయన కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మరో యువకుడు వైరస్ బారినపడ్డాడు. వీరందరిని బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. జిల్లాలో శనివారం నమోదైన కేసులతో మొత్తంగా 85కు చేరాయి. వీటిలో 37 మైగ్రెంట్ కేసులు కాగా, మరో రెండు మైగ్రెంట్ కాంటాక్ట్ ద్వారా వచ్చాయి. అలాగే 16 లోకల్ కేసులు, లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో 24 కేసులు కూడా రికార్డయ్యాయి. ఇతర జిల్లాల్లో ఉంటున్నవారిలో ఆరు కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు గాంధీ హాస్పిటల్ నుంచి 42 మంది, బెల్లంపల్లిలోని ఐసోలేషన్ సెంటర్ నుంచి ఏడుగురు, మొత్తం 49 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 47 శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉంది.