తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా

by Anukaran |
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,378 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి ఏడుగురు మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1,87,211కు చేరాయి. మరణాల సంఖ్య 1,107కు చేరాయి. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 29,673గా ఉన్నాయి. వైరస్ బారిన పడి సంపూర్ణ ఆరోగ్యంగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,56,431కి చేరింది. కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 254 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీలో మొత్తం కేసుల సంఖ్య 59,372కు చేరాయి.

Advertisement

Next Story