గడువు తీరిన పత్తి విత్తనాలు స్వాధీనం

by Sumithra |
గడువు తీరిన పత్తి విత్తనాలు స్వాధీనం
X

దిశ, క్రైమ్‌బ్యూరో: గడువు ముగిసిన పత్తి విత్తనాలను మార్కెట్‌లో విక్రయించేందుకు యత్నిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.కోటి విలువ చేసే 13వేల కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శామీర్‌పేట మండలం దేవరాయంజల్‌కు చెందిన సన్‌రైజ్ ఆగ్రో సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీరామ్ తమిళనాడుకు చెందిన సెంథిల్ సీడ్స్ ప్రైవేట్ కంపెనీతో విత్తనాల మార్కెటింగ్ నిమిత్తం ఏడాది పాటు కాంటాక్ట్ కుదుర్చుకున్నాడు. ఈ ప్రకారం లోధా బీజీ -2 సీడ్స్ పాకెట్స్‌ను తీసుకొచ్చాడు. వీటి గడువు 2020 ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసినా తిరిగి కంపెనీకి అప్పగించకుండా గోడౌన్‌లోనే భద్రపర్చుకున్నాడు. ఈ విత్తనాలను తిరిగి ఇతర గన్నీ బ్యాగుల్లో శివ నాగేశ్వరరావు, శాఖమూరి వెంకటేశ్వర‌రావు, అశ్విన్‌కుమార్, అంజిరెడ్డిల సాయంతో నింపుతూ కర్నూలు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేసి నలుగురిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed