- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కొనసాగిన ఏసీబీ అధికారులు సోదాల్లో అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, అవినీతి సాక్ష్యాలను ప్రభుత్వానికి నివేదిక అందజేశారు అధికారులు. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖ కమిషనర్ 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఏడు విభాగాల్లోని ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు, 8 మంది సిబ్బంది ఉన్నారు.
సస్పెండ్ అయిన వారు ఆలయ భూములు, షాపుల లీజు, అన్నదానం, ప్రసాదాల తయారీ, దర్శనాల టికెట్ల అమ్మకం, చీరల అమ్మకం విభాగాల్లో అవినీతికి పాల్పడినట్టు తేలింది. దీంతో వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు ఆదేశాలు జారీ చేశారు.