బల్దియా పోరులో 1,121 మంది

by Anukaran |
బల్దియా పోరులో 1,121 మంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను ఆదివారం అర్థరాత్రి దాటాక అధికారులు విడుదల చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గ్రేటర్ హైదరాబాదు లోనే 150 వార్డులలో 1,121 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు రోజుల్లో 2,575కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.

1893మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా… తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం మొత్తంగా 1,121 పోటీలో నిలుస్తున్నారు. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్‌ దాదాపుగా అన్ని డివిజన్లలో డివిజన్లలోనూ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు 500 మందికి పైగా పోటీలో ఉన్నారు.

Advertisement

Next Story