11 మందిని బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

by Sridhar Babu |   ( Updated:2020-06-17 06:05:58.0  )
11 మందిని బలితీసుకున్న రోడ్డు ప్రమాదం
X

దిశ, ఖ‌మ్మం: కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖ‌మ్మం జిల్లాకు చెందిన 11మంది మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. మృతులంతా ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం మండ‌లం పెద్ద గోపవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గోప‌వ‌రం గ్రామానికి చెందిన 25మంది ఒకే ట్రాక్ట‌ర్‌లో దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా.. జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద ఎదురుగా వచ్చిన‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. మిగతా వారు ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ప్రాణాలు విడిచారు. మ‌రో ప‌దిమంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇందులో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. స‌మాచారం అందుకున్న ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు.. జగ్గయ్య‌పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఘటనపై తక్షణ సహాయక చర్యలు అందే విధంగా ఎర్రుపాలెం అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Advertisement

Next Story