- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిమాచల్ ప్రదేశ్‌లో పది రోజులు లాక్‌డౌన్..
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోనూ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రకటించారు. మే 7(బుధవారం) నుంచి 17వరకు అనగా 10 రోజుల వరకు లాక్‌డౌన్ విధించనున్నట్లు వెల్లడించారు.
విమానం, రైలు, బస్సుల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారు 72 గంటలకు మించకుండా నెగెటివ్ నివేదిక తప్పనిసరి చేశారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు రద్దు చేయగా, విద్యార్థులను ప్రమోట్ చేస్తామన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మే 4వ తేదీన అత్యధికంగా 3,824 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 1,10,945 మందికి పాజిటివ్ బారిన పడ్డారు. తాజా అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో COVID-19 మరణాల సంఖ్య 1,647 గా ఉంది.