- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ వేలం కోసం 1097 మంది ఆటగాళ్ల రిజిస్ట్రేషన్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలం పాటకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసింది. ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైన్, రిలీజ్, ట్రేడింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాయి. దీంతో మినీ వేలంలోకి పలువురు ఆటగాళ్లు వచ్చి చేరారు. ఫ్రాంచైజీలు వదిలేసిన ఆటగాళ్లతో పాటు కొత్తగా ఆడాలనుకునే ఆటగాళ్లు కూడా తిరిగి వేలం పాట కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 18న చెన్నైలో జరుగనున్న వేలం కోసం ఫిబ్రవరి 4న (గురువారం) రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. ఈ సారి 1097 మంది ఆటగాళ్లు ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 814 మంది భారతీయ క్రికెటర్లు కాగా 283 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీలు కలిపి 61 మంది ఆటగాళ్లను కొనుక్కునే వీలుంది. ఈ వేలంలో అందుబాటులో ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్లు 21 మంది, అంతర్జాతీయ క్యాప్డ్ ప్లేయర్లు 186, అసోసియేట్ దేశాలకు చెందిన వాళ్లు 27 మంది, కనీసం ఒక ఐపీఎల్ ఆడిన అన్‌క్యాప్డ్ ఇండియన్స్ 50 మంది, కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అన్‌క్యాప్డ్ ఓవర్సీస్ ఆటగాళ్లు ఇద్దరు, అన్‌క్యాప్డ్ ఇండియన్స్ 743, అన్‌క్యాప్డ్ ఇంటర్నేషనల్ ఆటగాళ్లు 68 మంది ఉన్నారు. ఫిబ్రవరి 18న మూడు గంటల నుంచి వేలం మొదలవనున్నది.