కరోనాను భయపెట్టిన 103ఏళ్ల బామ్మ

by vinod kumar |
కరోనాను భయపెట్టిన 103ఏళ్ల బామ్మ
X

ఇరాన్ దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో మరణాల సంఖ్య కూడా అందుకు తగ్గట్టే ఉంది. అయితే ఈ మధ్యే కరోనా బారిన పడిన 103ఏళ్ల బామ్మ మాత్రం ఆ వైరస్‌నే భయపెట్టింది. వారం కిందట కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స అనంతరం ఆరోగ్యంగా బయటకు వచ్చింది. వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో రిపోర్టు నెగిటివ్ అని తేలింది. దీంతో కరోనాను జయించిన ఈ103ఏళ్ల బామ్మ పేరు ఇరాన్‌లో మారుమోగుతోంది.ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపించి వేశారు. కాగా, రీసెంట్‌గా అదే దేశంలో 91ఏళ్ల వృద్ధుడు కూడా కరోనా వ్యాధి నుంచి పూర్తి ఆరోగ్యంతో బయటపడ్డాడు.

Tags: 103 years old women, corona, negative reports, iran,91 years old men

Advertisement

Next Story

Most Viewed