కరోనాను జయించి.. బీర్ తో చీర్స్ కొట్టిన 103 ఏళ్ల బామ్మ

by vinod kumar |
కరోనాను జయించి.. బీర్ తో చీర్స్ కొట్టిన 103 ఏళ్ల బామ్మ
X

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ వస్తే చంపేస్తుందనే భయం అందరినీ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ వైరస్‌ను తట్టుకోగలిగే శక్తి మన శరీరానికి ఉంటే తప్పకుండా బయటపడవచ్చని చెప్పేందుకు ఈ 103 ఏళ్ల బామ్మగారే నిదర్శనం. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి సోకింది. ఇప్పటివరకు లక్షలాది మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. వృద్ధులకు కరోనా సోకితే బతకడం కష్టమనే భయాందోళనలు నెలకొన్నాయి. చైనా అధికారులతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం .. 80 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఈ వ్యాధి సోకితే చనిపోయే అవకాశాలు 21.9 శాతం ఉన్నాయని తేలింది. మన రాష్ట్రంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారులు, పెద్దలు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. ఇలాంటి సమయంలో అమెరికాలోని మసాచూసెట్స్ కు చెందిన 103 ఏళ్ల బామ్మ కరోనా నుంచి కోలుకుని అందరిలోనూ ధైర్యాన్ని నింపుతోంది. అంతేకాదు.. బెడ్ పైనే బీర్ తాగి.. సెలబ్రేట్ చేసుకుంది.

అమెరికాలోని మ‌సాచూసెట్స్ న‌గ‌రానికి చెందిన స్టెజ్నా అనే వృద్ధురాలు మే నెల తొలి వారంలో క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరింది. ఆమె కోలుకోలేదనే అందరూ భావించారు. కానీ ఆమె అనూహ్యంగా కరోనాపై విజయం సాధించి .. ఆరోగ్యంగా చిరునవ్వులు చిందిస్తోంది. ఈ ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఆమె మనవరాలు షెల్లీ ఆమెకు చిల్డ్ బీర్ అందించింది. దాంతో బెడ్ పైనే ఆమె బీర్ తాగి చీర్స్ కొట్టింది. ఎప్పుడూ చాలా హుషారుగా ఉండే త‌న బామ్మ ఆరోగ్యం విష‌మించింద‌ని, ఒక ద‌శ‌లో ఆమె మ‌ళ్లీ బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని డాక్ట‌ర్లు అన్నార‌ని షెల్లీ చెప్పింది. అయితే అదృష్టవ‌శాత్తు ఆమె పూర్తిగా కోలుకుం‌ద‌ని తెలిపింది. స్టెజ్నా కు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఆమె ఓ బింగో ప్లేయర్. 1938లో టెడ్డీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కలిసి 54 సంవత్సరాలు ఆనందంగా కలిసి ఉన్నారు. భ‌ర్త టెడ్డీ 82 ఏళ్ల వ‌య‌సులో 1992లో మ‌ర‌ణించాడు.

Advertisement

Next Story