- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్‌లో ఏప్రిల్ 14వరకు 100శాతం కర్ఫ్యూ
దిశ, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లాలో గురువారం సాయంత్రం 7 గంటల నుంచి ఏప్రిల్ 14 వరకు 100శాతం కర్ఫ్యూ, లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..100 శాతం కర్ఫ్యూ, లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు. కావున ప్రజలందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దన్నారు.జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినందున జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో 11 కంటామినెంట్ జోన్లను గుర్తించగా, అక్కడ 500 మీటర్ల పరిధిలో పూర్తిగా లాక్‌డౌన్ విధించమని తెలిపారు. నిర్మల్ పట్టణంలో 4, భైంసాలో 2, మిగతా 5గ్రామాల్లో కంటామినెంట్ జోన్లు గుర్తించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో కరోనా నిర్ధారణ అయినా వారి ఇంటి నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న 30వేల గృహాలను గుర్తించామని,అందులో 20 వేల ఇంటింటికి వెళ్లి సర్వే చేశామన్నారు. నిర్మల్ పట్టణంలో 105, భైంసా పట్టణంలో42, గ్రామాల్లో 5 వైద్య బృందాలు ఇంటింటా సర్వే చేస్తున్నాయన్నారు. ఈ బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం, దగ్గు, ఫ్లూ లక్షణాలున్న వారిని గుర్తించి వివరాలు అందజేస్తాయన్నారు. ప్రస్తుతం మనం స్టేజ్2లో ఉన్నాం కావున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో 5క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అవి : కేజీబీవీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాల, మహిళా ప్రాంగణం, ఐసోలేటెడ్ వార్డులు జిల్లా ఏరియా ఆస్పత్రి, నిర్మల్, భైంసా ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేశామన్నారు. విదేశాల నుంచి వచ్చిన 1100లో 45 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌లలో ఉంచగా అందులో 4గురికి పాజిటివ్ రాగా, మిగతా వారిని ఇంటికి పంపించామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని వైద్యం కోసం హైదరాబాద్ తరలించామని చెప్పారు.నెగెటివ్ వచ్చిన వారిని ముందస్తు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్‌కు ఆదేశించామన్నారు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న 114మందిలో 59 మందిని గురువారం ఇంటికి పంపించగా, మిగతా 55 మందికి శుక్రవారం పంపిస్తామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే 1800 4255566 లేదా డయల్ 100కు సంప్రదించాలన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ.. అత్యవసం లేకుండా ఎవరైనా బయట తిరిగితే ఎపిడమిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 6నెలల నుంచి 3ఏండ్ల వరకు జైలుశిక్ష విధిస్తామన్నారు.మోటార్ సైకిల్‌లు, కార్లు, ఆటోలు సీజ్ చేసి కోర్టుకు సరెండర్ చేస్తామన్నారు.జిల్లాలో మెడికల్ షాపులు, ఆస్పత్రులు మినహా ఏవీ తెరవకూడదన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు 1000 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు.
Tags: carona, lockdown, nirmal, 100percent karfue, collecter farooqui, sp sashidar raju