- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 శాతం వ్యాక్సినేషన్‌కు సహకరించాలి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్టంలో 100 శాతం వ్యాక్సినేషన్‌కు ప్రజలంతా సహకరించాలని ఆరోగ్యశాఖ మరోసారి కోరుతున్నది. వివిధ రకాల అపోహాలతో గ్రామాల్లో టీకా పంపిణీ మందగిస్తొన్నదని, అలాంటి ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని పేర్కొన్నది. అర్హులైన ప్రతీ వ్యక్తి టీకా పొందితేనే సదరు గ్రామాలకు వైరస్ బారి నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఉండే మెడికల్ ఆఫీసర్లతో సమన్వయమై ఆయా గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతీ వ్యక్తి డోసును పొందేలా చైతన్యం తీసుకురావాలన్నది. ఈ నెలాఖరు వరకు రాష్ర్ట వ్యాప్తంగా 100 శాతం టీకా పంపిణీ చేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యం పెట్టుకున్నదని, దానికి గ్రామాల్లో ఉండే యువత, విద్యావంతులు తోడ్పడాలన్నది.
కొత్తగా మరో 2,21,261 మందికి టీకా..
రాష్ర్టంలో కొత్తగా మరో 2,21,261 మందికి వ్యాక్సిన్ పొందారు. వీరిలో 1,10,692 మంది మొదటి, 1,10,569 మంది రెండో డోసును తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో ఇప్పటి వరకు రాష్ర్ట వ్యాప్తంగా 1,42,08,250 మంది ఫస్ట్ డోసు, 52,92,639 మంది రెండో డోసునూ పూర్తి చేసుకున్నారు.