కేన్సర్ రోగుల కోసం.. పదేళ్ల చిన్నారి హెయిర్ డొనేట్

by Sujitha Rachapalli |
కేన్సర్ రోగుల కోసం.. పదేళ్ల చిన్నారి హెయిర్ డొనేట్
X

దిశ, వెబ్‌డెస్క్ : కేన్సర్ రోగులకు జుట్టు ఊడిపోతుందనే విషయం తెలిసిందే. ఇలాంటి పేషెంట్లకు విగ్గుల కోసం చాలా మంది తమ జుట్టును డొనేట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సూరత్‌కు చెందిన ఓ పదేళ్ల చిన్నారి.. తాను ఇష్టంగా పెంచుకున్న జుట్టును కేన్సర్ రోగులకు అందించి తన పెద్ద మనసును చాటుకుంది.

సూరత్‌కు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్‌ దేవ్నా జనార్థన్‌.. కేన్సర్ రోగుల కోసం ఏదైనా చేయాలని భావించి, తన 32 అంగుళాల పొడవాటి జుట్టును డొనేట్ చేసింది. అంతేకాదు, భవిష్యత్తులో తను కేన్సర్ స్పెషలిస్ట్ అయి, వారికి చికిత్స చేయాలని కోరుకుంటున్నానని తెలిపింది. దేవ్నా జుట్టు ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత చిన్న వయసులో గొప్ప నిర్ణయం తీసుకున్న దేవ్నాను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సాధారణంగా అక్టోబర్‌ నెలను మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించే నెలగా పరిగణిస్తూ.. విస్తృత ప్రచారం చేస్తుంటారు. ఇటీవల కాలంలో.. ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ‘నో షేవ్ నవంబర్’ తెలిసే ఉంటుంది. నెల మొత్తం గడ్డం చేసుకోకుండా ఆ డబ్బులను కేన్సర్‌ పేషెంట్లకు విరాళంగా ఇవ్వడమే ‘నో షేవ్‌ నవంబర్‌’ ఉద్యమం. అదే విధంగా పురుషుల్లో కనిపించే టెస్టికల్, ప్రొస్టేట్‌ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నవంబర్‌ నెల మొత్తం పురుషులంతా ఇలా గడ్డం పెంచాలన్నది ఈ ఉద్యమ ధ్యేయం. 2009లో అమెరికాకు చెందిన ‘మొవంబర్‌ ఫౌండేషన్‌’అనే సంస్థ పురుషుల్లో కనిపించే కేన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని చేపట్టింది.

Advertisement

Next Story