రామాయణాన్ని ఒడియాలో రచించిన పదేళ్ల బాలుడు

by Anukaran |   ( Updated:2021-02-28 07:00:10.0  )
రామాయణాన్ని ఒడియాలో రచించిన పదేళ్ల బాలుడు
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల అందరూ బిజీ లైఫ్ నుంచి కొంతకాలం పాటు డిస్ట్రాక్ట్ అయ్యారు. ఆ టైమ్‌లో ఇంట్లోనే ఖాళీగా ఉండకుండా చాలా మంది తమలో దాగి ఉన్న కళను బయటకు తీసే ప్రయత్నం చేశారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆర్ట్ ప్రాక్టీస్, ఫార్మింగ్, ఫిట్‌నెస్ ఇంకా పలు అంశాలపై పట్టు సాధించేందుకు తమదైన కృషి చేయగా, ఒడిషాకు చెందిన ఓ పదేళ్ల బాలుడు తన మాతృభాషలో రామాయణాన్ని రచించాడు.

ఒడిషా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన ఆయుష్ కుమార్ ఖుంతియా.. లాక్‌డౌన్ టైమ్‌లో బయటకెళ్లి ఆడుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఒకవేళ బయటకు వెళ్లగలిగినా తనతో ఆడుకునేందుకు స్నేహితులు ముందుకొచ్చే పరిస్థితులు లేవు. ఈ క్రమంలో బాలుడి బాబాయ్.. ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు ఏదైనా పుస్తకాలు చదువుకోవాలని లేదా డీడీ చానల్‌లో ప్రసారమయ్యే రామాయణం చూడాలని తనకు సూచించాడు. ఈ మేరకు రామాయణ ఎపిసోడ్‌లను చూడటం ప్రారంభించిన ఆయుష్.. తను చూసిన రామాయణం ఎపిసోడ్లను పుస్తక రూపంలో రచించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే హిందీలో ప్రసారమైన రామాయణ ఎపిసోడ్ చూసిన వెంటనే తన మాతృభాష ఒడియాలో నోట్ బుక్‌లో రాయడం స్టార్ట్ చేసి, రెండు నెలల్లో పూర్తి చేశాడు. ఆ పుస్తకానికి ‘పిలక రామాయణ(Ramayana for children)’ అని నామకరణం కూడా చేశాడు.

104 పేజీలున్న ఈ పుస్తకంలో రామాయణంలోని అద్భుతమైన ఘట్టాలను రచించానని, రాముడి 14 ఏళ్ల వనవాసం, పంచవతి అడవి నుంచి సీతాదేవిని రావణుడు అపహరించడం, అయోధ్య రాముడికి ప్రజలు ఎలా స్వాగతం పలికేవారు తదితర అంశాలను వివరించానని చెప్పాడు. ప్రతీ ఒక్కరు చదవడం, రాయడం అలవాటు చేసుకోవాలని తద్వారా ఉన్నత స్థానానికి వెళ్లొచ్చని ఆయుష్ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed