జోగులాంబ గద్వాలలో ఈరోజు 10 పాజిటివ్ కేసులు 

by vinod kumar |

దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారికంగా ప్రకటించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం విచారకరమన్నారు. అధికారులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా తాజాగా మరో 10 కేసులు నమోదు కావడం జిల్లావ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈరోజు గద్వాల పట్టణంలో 7, ఆలంపూర్‌లో 3 కేసులు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. గద్వాల జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 42కు చేరింది.

Tags: corona , 10 positive cases, minister etela rajender, gadwal dist

Advertisement

Next Story

Most Viewed