మలేషియాలో 10 మందికి కరోనా

by Shamantha N |
మలేషియాలో 10 మందికి కరోనా
X

లేషియాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం మరొకరికి కరోనా సోకినట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో బాధితుల సంఖ్య 10కి చేరింది. మలేషియాకు చెందిన 41 ఏండ్ల వ్యక్తి గత నెలాఖరులో ఓ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్‌ వెళ్లాడు. ఆ సమావేశానికి చైనా ప్రతినిధులూ హాజరయ్యారు. ఇందులో ఒక్కరు వుహాన్ నగరానికి చెందినవారు ఉన్నారు. ఈ నగరం నుంచే కరోనా కొత్తరకం వైరస్ వ్యాపించిన విషయం తెలిసిందే. జనవరి 29న అతను తిరిగి స్వదేశానికి రాగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

Advertisement

Next Story