ఆటోను పల్టీ కొట్టించిన కుక్క.. కూలీల వివరాల కోసం ఆరా

by Sumithra |   ( Updated:2021-12-19 00:49:57.0  )
Aoud-accident1
X

దిశ, నేలకొండపల్లి: కూలీలతో వెళ్తున్న ఆటో ఆదివారం ఉదయం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పలువురి కూలీలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అజయ్ తండాకు చెందిన 10 మంది వ్యవసాయ కూలీలు కూసుమంచి మండలంలోని లింగ రామ్ తండాలోని మిర్చి తోట ఏరేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొరట్లగుడెం గ్రామంలో ఆటోకి ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా అక్కడి స్థానికులు గమనించి వారిని నేలకొండపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కులీల వివరాలు తెలియాల్సి ఉంది.

auto-accident-22

Advertisement

Next Story