- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ సోకిన ముగ్గురిలో ఒకరికి.. తీవ్ర మానసిక సమస్యలు!
దిశ, ఫీచర్స్ : కొవిడ్ -19 నుంచి ప్రాణాలతో బయటపడిన ముగ్గురిలో ఒకరు.. తమకు SARS-CoV-2 వైరస్ సోకిన ఆర్నెళ్లలోనే నాడీ సంబంధిత లేదా మెంటల్ హెల్త్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ‘ది లాన్సెట్ సైకియాట్రీ’ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ట్రైనెట్ఎక్స్ నెట్‌వర్క్ నుంచి సేకరించిన 236,379 మంది కొవిడ్ -19 రోగుల డేటాను విశ్లేషించగా.. ఈ తరహా సమస్యలతో బాధపడేవారి సంఖ్య 34 శాతంగా ఉన్నట్లుగా తేలింది. పైగా వీరిలో 13% మందికి ఇలాంటి వ్యాధులు రావడం ఇదే తొలిసారని తేలింది. కాగా SARS-CoV-2 వైరస్ బారినపడి (జనవరి 20, 2020 తర్వాత) పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారితో పాటు సజీవంగా ఉన్న రోగుల(డిసెంబర్ 13 తర్వాత) వివరాలను ఈ అధ్యయనం కోసం ఉపయోగించారు.
కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నా.. అనారోగ్య సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. తాజా అధ్యయనంలో కూడా ఇదే విషయం నిరూపితమైంది. కరోనా సోకిన తర్వాత 17% మంది రోగుల్లో యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తుండగా, మూడ్ డిజార్డర్స్ (14%), సబ్‌స్టాన్స్ మిస్‌యూజ్ రుగ్మతలు (7%), నిద్రలేమి (5%), మెదడులో రక్తస్రావం (0.6%), ఇస్కేమిక్ స్ట్రోక్- (2.1%), డిమెన్షియా (0.7%) వంటి రుగ్మతలకు గురౌతున్నట్లు వెల్లడైంది. ఇక కొవిడ్ -19 లక్షణాలు అధికంగా ఉన్న రోగుల్లో న్యూరోలాజికల్ లేదా సైకియాట్రిక్ డయాగ్నసిస్ తీవ్ర రూపుదాలుస్తోంది. మొత్తం 34% సంభావ్యతతో పోలిస్తే.. ఆస్పత్రిలో చేరిన వారిలో 38%, ఇంటెన్సివ్ కేర్‌లో 46%తో పాటు కొవిడ్ -19 సమయంలో మతిమరుపు (ఎన్సెఫలోపతి) ఉన్నవారిలో 62% మందికి నాడీ లేదా మానసిక రోగ సమస్యలు తలెత్తినట్టు నిర్ధారణ జరిగింది.
‘ఫ్లూ లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కంటే.. కొవిడ్ -19 తర్వాత మెదడు వ్యాధులు, మానసిక రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయని మా ఫలితాలు సూచిస్తున్నాయి. ఆరు నెలలు దాటాక ఇంకా ఎలాంటి పరిమాణాలు జరుగుతాయో వేచి చూడాలి. ఈ అధ్యయనం కోసం ఉపయోగించిన మెకానిజంను బహిర్గతం చేయలేం. కానీ వీటిని నిరోధించడానికి లేదా ముందుగానే చికిత్స చేయడానికి అత్యవసర పరిశోధన అవసరమైతే ఉంది’ అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, అధ్యయన కో-ఆథర్ డాక్టర్ మాక్స్ టాకెట్ అన్నారు.