- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోక్యో ఒలంపిక్స్ అథ్లెట్స్‌కు 1.5లక్షల కండోమ్స్.. కండిషన్స్ అప్లై!
దిశ, వెబ్‌డెస్క్ : జపాన్ అతిధ్యమివ్వనున్న టోక్యో ఒలంపిక్స్ -2020 కరోనా కారణంగా ఈసారి ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. తొలుత ఒలంపిక్స్ రద్దవుతాయని ఒలంపిక్స్ సంఘం, క్రీడాకారులు భావించినా ఆలస్యంగా నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టోక్యో ఒలంపిక్స్-2021 గేమ్స్ జులై-23న గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. అయితే, ఈసారి క్రీడాకారులకు సంబంధించి కొత్త రూల్స్ బుక్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. దీని ప్రకారం అథ్లెట్లకు 1,50,000 కండోమ్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కరోనా నేపథ్యంలో పరిమిత పరిచయం (లిమిటెడ్ కాంటాక్ట్) నిబంధన విధించినట్లు పేర్కొన్నారు. దీంతో కేవలం 1.5లక్షల మందికి మాత్రమే కండోమ్స్ అందజేస్తామన్నారు. క్రీడాకారులు కూడా పరిమిత సంఖ్యలో ఇతరులతో సంబంధం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్, జిమ్స్, టూరిస్ట్ ఏరియాలు, షాప్స్‌కు కూడా పరిమిత సంఖ్యలో అనుమతించనున్నట్లు ఒలంపిక్స్ నిర్వాహకులు తెలిపారు.