పుచ్చకాయను కొంటున్నారా.. అది కాయా పండా..? ఎలా తెలుసుకోవాలి..?

by Aamani |
పుచ్చకాయను కొంటున్నారా.. అది కాయా పండా..? ఎలా తెలుసుకోవాలి..?
X

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్‌లో తినే ఉత్తమమైన పండ్లలో పుచ్చకాయ ఒకటి. మండే ఎండల్లో డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవాలంటే అలా శాంతమైన తీయని రుచికరమైన పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే రుచికరమైన పుచ్చకాయ మన సొంతమవుతుంది.

గతంలో పుచ్చకాయ పరీక్షించేందుకు వ్యాపారస్తులు ముక్కలుగా కత్తిరించి ఇచ్చేవారు ఇటీవల కాలంలో పరిశుభ్రత ఇది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి పుచ్చకాయ సంపూర్ణంగా పండింది తెలుసుకోవాలంటే కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. పుచ్చకాయను కొట్టి శబ్దాన్ని గమనించండి. డోర్ తట్టినట్లు మీ మెటికాలతో పుచ్చకాయను కొట్టండి. సంపూర్ణంగా పడిన పుచ్చకాయ నుంచి తక్కువ శబ్దం వస్తుంది. పుచ్చకాయ వాసన చూడండి. మీ ముక్కు దగ్గర పెట్టుకొని పుచ్చకాయ వాసనను గమనించండి సువాసన ఎక్కువగా ఉంటే బాగా పండింది అని అర్థం పండని పుచ్చకాయ చాలా గట్టితో కొను కలిగి ఉంటుంది. సరిగ్గా పండిన పుచ్చకాయపై తొక్క మీ చేతుల్లో నొక్కినప్పుడు మెత్తబడినట్లు అనిపిస్తే అది బాగా పండినది అని తెలుసుకోవాలి. ఇది పుచ్చకాయని పడిందా లేదా తెలుసుకునేందుకు సులభమైన పుచ్చకాయపై సంపూర్ణంగా పండిందని అర్థం. పసుపుపచ్చ కలర్‌లో ఉంటే అది పండించిన స్థలంలోనే పక్వానికి వచ్చినట్లు గ్రహించాలి. పుచ్చకాయ కలర్ తెలుపు రంగులో ఉంటే అది ఇంకా పక్వానికి రాలేదని గమనించాలి.

ఇవి కూడా చదవండి:

‘మనీ ప్లాంట్‌’ను ఇంట్లో పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisement

Next Story