‘వారిని విస్మరించిన ప్రభుత్వాలకు పుట్టగతులుండవు’

by Shyam |
cpi leader chada
X

దిశ, సిద్దిపేట: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి, నిరుద్యోగ భృతి 3016 రూపాలయలను వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ – ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని స్థానిక శివానుభవ కల్యాణ మండపంలో విద్యార్థి, నిరుద్యోగ పోరు సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మన్నె కుమార్, ఏఐవై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి శ్రవణ్ కుమార్ లు అధ్యక్షత వహించగా సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావి శివరామకృష్ణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్‌లు ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యా, ఉపాధి రంగాల్లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలని, పెండింగులో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ మెంట్స్ ను విడుదల చేయాలి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను, వివిధ శాఖలలో ఉన్న (1, 90,000) ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు 1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని, ప్రభుత్వ భూముల వేలంపాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలను విద్యార్థి సంఖ్యకు అనుగుణంగా నిర్మించాలని తెలిపారు. విద్యాహక్కు చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని, జీ.వో నెంబర్ 46 ను పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, ప్రతి నిరుద్యోగికి 10,000 నిరుద్యోగ భృతిని చెల్లించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు, నియంత్రణ కోసం ఒక జీవోని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్, ఏఐవైఎఫ్ యువ మహిళా జిల్లా కన్వీనర్ దారవత్ ఉమ, సంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకులు, సిద్దిపేట జిల్లా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆఫీస్ బేరర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story