రైజింగ్ స్టార్ రిషి.. యూకే మినిస్టర్

by vinod kumar |
రైజింగ్ స్టార్ రిషి.. యూకే మినిస్టర్
X

ప్రపంచ దిగ్గజ సంస్థలకు భారత సంతతికి చెందిన ప్రముఖులు నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అగ్రదేశాల ప్రభుత్వాల్లోనూ మనోళ్లు కొలువుదీరుతున్నారు. తాజాగా, భారత సంసతికి చెందిన రిషి సునాక్ యూకే ఫైనాన్స్ మినిస్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..

భారత మూలాలున్న డాక్టర్ యశ్‌వీర్, ఫార్మసిస్టు ఉషా సునాక్‌ల తనయుడు రిషి. యశ్‌వీర్, ఉషాలు తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వలసవెళ్లారు. యూకే వలసవెళ్లిన మొదటి తరానికి చెందినవాడే మన రిషి సునాక్. సౌథాంప్టన్‌లో 1980లో జన్మించిన రిషి వించెస్టర్ కాలేజీ విద్యభ్యాసాన్ని మొదలుపెట్టి పేరుగాంచిన యూనివర్సిటీల్లో డిగ్రీ పట్టాలు పొందాడు. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లు చదువుకున్నాడు. స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందాడు. భారత బిలియనీర్ నారాయణమూర్తి తనయ అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్నాడు.

చదువుల్లో దిట్ట. ఆర్థ శాస్త్రం, రాజనీతిలో మంచి పట్టు ఉన్న రిషి నేరుగా రాజకీయాల్లోకి రాలేదు. ముందు గోల్డ్‌మన్ సాచ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులాంటి ప్రసిద్ధ సంస్థల్లో చేరాడు. 2015లో రిచ్‌మండ్ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీలో వేగంగా అగ్రస్థానానికి చేరాడు. పాక్ సంతతికి చెందిన సాజిద్ జావిద్ రాజీనామా తర్వాత ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ పదవిని రిషి అలంకరించాడు. జావిద్ కూడా రిషికి మద్దతుదారే. పార్టీలో ఇప్పుడు రిషిని రైజింగ్ స్టార్ అని అభివర్ణిస్తుంటారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు నమ్మకమైన వ్యక్తి. అందుకే మీడియా చర్చల్లో బోరిస్ జాన్సన్‌కు బదులుగా రిషి వెళ్లి మాట్లాడుతుంటాడు.

ఎక్కడున్నా తన మూలాలను మరిచిపోనని చెప్పే రిషి.. తాను ఏషియన్ అన్న గుర్తింపు ఎప్పటికీ విలువైనదిగా భావిస్తానంటాడు. సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిస్తాడు. హిందువునైనా తాను వారాంతాల్లో ఆలయాలకు వెళ్లుతుంటానని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed