- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ కొంపముంచిన ‘ఉగ్రవాది’
అవి.. 2012, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు. మూడోసారి సీఎం కావాలని నరేంద్ర మోదీ పరితపిస్తున్న కాలం. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. కానీ, ఒకే ఒక మాట ఆ ఎన్నికల వాతావరణాన్ని మార్చేసింది. ఓ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ అప్పటి సీఎం నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ మౌత్ కా సౌదాగర్ (మృత్యు బెహారీ) అని అన్నారు. ఇక అప్పటి నుంచి ఎన్నికల మొత్తం ఈ విషయం చుట్టే తిరిగాయి. గుజరాత్ ప్రజలను మృత్యు బెహారీ అని సోనియాగాంధీ సంబోధించారని నరేంద్రమోదీ ప్రచారం చేశారు. ఫలితం బీజేపీకి అనుకూలించింది. మొత్తం 212 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 115 వచ్చాయి. నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
ప్రస్తుతం.. 2020, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీ, ఆప్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ అభ్యర్థి కపిల్‌మిశ్రా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ఉగ్రవాది అని సంబోధించారు. దీనికి మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ వత్తాసు పలికారు. కేజ్రీవాల్ ఉగ్రవాదే అంటూ విలేకరుల సమావేశం పెట్టిమరి చెప్పుకొచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తొలి రోజుల్లో అభివృద్ధి, ఆ తర్వాత షాహిన్‌బాగ్ చుట్టూ తిరిగి… ‘ఉగ్రవాది’ దగ్గర వచ్చి ఆగాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో ఇదే ప్రధానాంశమైంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మృత్యు బెహారీ ఫలితమే ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చింది. ఆమ్ అద్మీ పార్టీ భారీ విజయం నమోదు చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 63 చోట్ల ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణం చేయనున్నారు.
ఏదిఏమైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన తప్పే బీజేపీ నాయకులూ చేయడం ఆప్‌కు కలసి వచ్చింది. అప్పుడు ‘మృత్యు బెహారీ’ని నరేంద్ర మోదీ ఎలా చక్కగా వాడుకున్నారో.. ఇప్పుడు ‘ఉగ్రవాది’ని అరవింద్ కేజ్రీవాల్ అలాగే వినియోగించుకున్నారు. ‘నేను ఉగ్రవాదిని అయితే బీజేపీకి ఓటు వేయండి’ అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం చివరిరోజు కేజ్రీవాల్ భార్య, కూతురు ఇదే విషయమై మీడియాతో మాట్లాడారు. గత ఐదేండ్లలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు తన తండ్రి ఉగ్రవాది అయ్యాడా అని ఆయన కూతురు ప్రశ్నించారు. పాఠశాలలు బాగు చేయడం, ఉచిత విద్యుత్, నీరు వంటి సంక్షేమ పథకాలు చేపట్టిన కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అని సంబోధించడం తట్టుకోలేకపోయిన ఓటర్లు బీజేపీకి షాక్ ఇచ్చారు. ఆ పార్టీని ఏడు సీట్లకు పరిమితం చేశారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎత్తుగడనే.. అదే పార్టీపై ఆప్ ప్రయోగించడం కొసమెరుపు.