పేదింటి శుభకార్యం.. పెళ్లికూతురికి అండగా నిలిచిన జడ్పీటీసీ, ఉపసర్పంచ్

by Shyam |   ( Updated:2021-08-24 11:01:08.0  )
varalaxmi
X

దిశ,ఆమనగల్లు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి జడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మంగళవారం 100 కేజీల బియ్యం సాయం చేశారు. ఇటీవల ఆ ఇంటి ఆడపడుచు వరలక్ష్మీకి వివాహం కుదిరింది. అయితే, పెళ్లి చేసేందుకు కూడా కుటుంబం ఆర్థిక పరిస్థితి బాలేదు.

ఈ విషయం తెలుసుకున్న తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల ట్రస్ట్ ద్వారా వంద కేజీల బియ్యాన్ని తన వంతుగా ఆ కుటుంబానికి సాయం ప్రకటించారు. ఈ సాయాన్ని గ్రామ ఉప సర్పంచ్ అజీజ్ మంగళవారం వారికి అందచేశారు. అంతేకాకుండా, తన వంతు సాయంగా ఉపసర్పంచ్ 1000 రూపాయల నగదు ఆర్థిక సాయాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగయ్య, నాయకులు రాజు, రమేష్, మహేష్, శ్రీశైలం, విష్ణు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story