- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జెడ్పీటీసీ.. వంటమనుషులు గైర్హాజరుపై సీరియస్
దిశ, నెక్కొండ: నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోల్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్, జెడ్పీటీసీ సభ్యురాలు లావుడ్యా సరోజన హరికిషన్ నాయక్ లు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంట గది, తరగతి గదులను పరిశీలించారు. గత నెల రోజులుగా వంటమనుషులు గైర్హాజరు కావడం కారణంగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించకపోవడంపై ఎంపీపీ, జెడ్పీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేకాధికారి సునీత, గ్రామ సర్పంచ్ ఎండీ మహబూబ్ పాషా, గుండ్రపల్లి సర్పంచ్ బొంపెళ్లి రాజేశ్వర్ రావు, గొల్లపల్లి ఎంపీటీసీ సంగని సూరయ్య, గ్రామస్తులు చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Tags
- inspected