కట్టెల పొయ్యిపై జడ్పీ చైర్ పర్సన్ వంటలు

by Shyam |
కట్టెల పొయ్యిపై జడ్పీ చైర్ పర్సన్ వంటలు
X

దిశ, రంగారెడ్డి: అధికారిక సమావేశాలు, సమీక్షలతో నిత్యం బిజీగా గడిపే వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి లాక్‎డౌన్‎లో ఇంటిపనులు కూడా తానే స్వయంగా చేసుకుంటూ నిరాడంబ వ్యక్తిత్వాన్ని చాటుతున్నారు. చిటికేస్తే పనులు చక్కబెట్టే పనిమనుషులు ఉన్నా.. ఇంట్లో ఇల్లాలుగా విధులు నిర్వహిస్తూ మహిళలకు ఆదర్శoగా నిలుస్తున్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గురువారం కట్టెల పొయ్యిపై మట్టి కుండాలో వంట చేశారు. ఇలా చేయడం ద్వారా వంటలు రుచికరంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. సమయం దొరికినప్పుడు ఇలా ఇంట్లో పనులు చేయడం ఇష్టామని సునీతా రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story