- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీలను ఓట్ల కోసం వాడుకునేటోడివి..
దిశ, కరీంనగర్:
ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓట్ల కోసం మాత్రమే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు వాడుకుంటున్నాడని పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. శనివారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మంథని పీఎస్‌లో చనిపోయిన శీలం రంగయ్య మృతదేహాన్ని ఉస్మానియా, గాంధీ వైద్యులతో పోస్ట్ మార్టం చేయించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేయడంపై పుట్ట మధు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మంథని మధుకర్ కేసులో అదే ఆస్పత్రులకు చెందిన వైద్యుల బృందం ఇచ్చిన పోస్ట్ మార్టం గురించి ఎందుకు ప్రశ్నించలేదన్నారు.నాడు కావాలని రాజకీయం చేసిన శ్రీధర్ బాబు గెలిచిన తరువాత ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. మూడు గంటల్లో మంథనికి వచ్చే అవకాశం ఉన్నా రంగయ్య మృతి రోజు రాకపోవడానికి కారణాలు వెల్లడించాలన్నారు. నువ్వో చీటర్, గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నిన కేసులో నిందితునివి, కలప స్మగర్ల పైసలు దాచుకున్నోవి అంటూ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు.అంతేకాకుండా నీవు మంత్రిగా ఉన్న సమయంలో పెద్దపల్లి వద్ద కాన్వాయ్ ఢీ కుని చనిపోయిన వారిని కనీసం చూడకుండా వెళ్లిపోయావని, అలాంటిది నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తావా?అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకొసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఎమ్మెల్యేపై విరుచుకపడ్డారు.