- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోన్లలో అలెర్ట్
దిశ, మెదక్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నుంచి 24 వార్డు వరకు రెడ్ జోన్లుగా ప్రకటించామని జహీరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు తెలిపారు . జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పోలీసు , మున్సిపల్ , వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు . మున్సిపల్ పరిధిలోని ” గడి ” బస్తీలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు . పారిశుద్ధ్య పనులకు మూడు బృందాలు ఏర్పాటు చేశామన్నారు . వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి , నివేదిక ఇవ్వాలన్నారు . కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ దవాఖానకు తరలించామన్నారు . రెడ్ జోన్ వార్డులోని ప్రజలు బయటకు రావద్దని సమాచారం ఇస్తే నిత్య వసర వస్తువులు పంపిస్తామన్నారు . అనంతరం డిఎస్పి గణపతి జాదవ్ మాట్లాడుతూ . . . లాక్ డౌన్ ముగిసే వరకు ప్రజలు ఎవరు బయటకు రావొద్దు అన్నారు . మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు . సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి , జహీరాబాద్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో శంకర్ , మునిసిపల్ సిబ్బంది , వైద్య సిబ్బంది , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .
Tags: containment zones, red alert, rto ramesh, sangareddy, carona, lockdown