- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో ఉద్యోగుల విభజన షురూ..
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల జోనల్ విభజనలో భాగంగా మండలి ఎన్నికల కోడ్ లేని నాలుగు జిల్లాల్లో ఆఫ్షన్ల ప్రక్రియ పూర్తి అయింది. నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో జిల్లాస్థాయి ఉద్యోగుల నుంచి ఆఫ్షన్లు తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాల్లో ఈ నెల 15 తర్వాత ఆఫ్షన్లు తీసుకోనున్నారు. మరోవైపు దీనికి అనుబంధంగా జోనల్పై కూడా కసరత్తు మొదలైంది. జోనల్స్థాయిలో కూడా ఆఫ్షన్లు తీసుకుంటామని అధికారులు చెప్పుతున్నారు.
ఈ ప్రక్రియను రాష్ట్రస్థాయిలో మానిటరింగ్ చేసేందుకు ముగ్గురు ఐఏఎస్లకు బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఐఏఎస్ రాహుల్ బొజ్జా, అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫైనాన్స్ సెక్రెటరీ రోనాల్డ్ రోస్లకు బాధ్యతలను ఇచ్చారు. రోజువారీగా ఆఫ్షన్ల ప్రక్రియ, కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలు, సీనియార్టీ జాబితా వంటి అంశాలన్నీ ఈ అధికారులు మానిటరింగ్ చేయనున్నారు.
సీనియార్టీ జాబితాపై ఉద్యోగుల ఆగ్రహం
మరోవైపు నాలుగు జిల్లాల్లో ఆఫ్షన్ల ప్రక్రియ మొదలైనా, కొన్నిచోట్ల ఉద్యోగులు సీనియార్టీ జాబితాపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికతను పరిగణించకుండా.. కేవలం సీనియార్టీతో కేటాయింపులు చేస్తే స్థానికులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిపై ఆయా శాఖల ఉన్నతాధికారులను ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. దీనిపై ఎలాంటి అన్యాయం జరుగదంటూ ఉద్యోగులకు హామీ ఇస్తున్నారు.
ప్రస్తుతం ఆఫ్షన్లను స్వీకరించిన జిల్లా కలెక్టర్లు.. వాటిని నోడల్ జిల్లాకు పంపించారు. ఇక్కడి నుంచి కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారుల పరిశీలనలో బదిలీలు చేయనున్నారు. ఈ నెల 15 వరకు సీనియార్టీ ప్రకారం బదిలీలు చేసి, అలాట్మెంట్ ఆర్డర్లు జారీ చేయనున్నారు.