- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసక్తికరంగా ఎమ్మెల్సీ ఎన్నికలు.. హాట్ టాపిక్‌గా జడ్పీ చైర్‌పర్సన్ ఓటు
దిశ, కాటారం : ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాలతో కలిపి నూతనంగా ఏర్పాటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నింటా ప్రత్యేకమే. విధాన సభకు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఓటు ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐదు మండలాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికల్లో ఓటు వినియోగించుకోనున్నారు.
అయితే.. పరిపాలన పరంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వైపు జిల్లా కేంద్రం ఉండగా.. ఎన్నికల పరంగా మంథని శాసనసభ నియోజకవర్గంలో ఈ ఐదు మండలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జక్కు శ్రీ హర్షిని.. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ ప్రాంత ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ క్యాంపులో ఉండగా కాంగ్రెస్‌కు చెందిన సభ్యులంతా మరో క్యాంపులో ఉన్నారు.