- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
95 శాతం క్షీణించిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ లాభం
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం (Financial year)జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ నికర లాభం (Zee Entertainment Enterprises Net Profit) 94.5 శాతం క్షీణించి రూ. 29.28 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం (Net profit) రూ. 529.76 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 36.6 శాతం తగ్గి రూ. 1,338.41 కోట్లకు చేరుకుందని, ఇది గతేడాది రూ. 2,112.03 కోట్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ (Regulatory Filing)లో పేర్కొంది.
ఇక, ఈ త్రైమాసికంలో కంపెనీ ప్రకటనల ఆదాయం (Income) 64.5 శాతం తగ్గి రూ. 421.06 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే కాలంలో ప్రకటనల ఆదాయం (Advertising revenue) రూ. 1,186.71 కోట్లుగా నమోదైంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కొవిడ్-19 ప్రభావం (Kovid-19 effect) కంపెనీ ఫలితాలపై ఉందని, ప్రస్తుతం పరిమితుల మధ్యనే కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఇటీవల ఆంక్షలు సడలించడంతో కంటెంట్ (Content) ప్రారంభించడానికి వీలుందని, రానున్న రోజుల్లో కంపెనీ కార్యకలాపాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.
కొవిడ్-19 (kovid-19 ) కారణంగా ఏర్పడ్డ సమస్యలను అధిగమించేందుకు భవిష్యత్తు ఆర్థిక పరిస్థితుల అంచనా (Estimation of future economic conditions), సమీక్షతో పాటు, ద్రవ్యతను పెంచడం (Increasing liquidity), వివిధ వ్యయ పొదుపు (Various cost savings) కార్యక్రమాల వంటి పలు చర్యలు చేపడుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (Non-Executive Director)గా ఉన్న సుభాష్ చంద్ర రాజీనామాను డైరెక్టర్ల బోర్డు అంగీకరించినట్టు కంపెనీ పేర్కొంది. ఈ బాధ్యతలను కంపెనీ ఛైర్మన్ నిర్వహించనున్నారు.