బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి దంపతులు

by srinivas |
బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి దంపతులు
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తన సతీమణితో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వైవీసుబ్బారెడ్డి సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ చైర్మన్‌, ఈవో అందజేశారు. ఇకపోతే వైవీ సుబ్బారెడ్డిని మరోసారి టీటీడీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే పాలకమండలిని కూడా నియమిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story