టీమిండియాకు ఆ సిరీస్ సవాలే : యువరాజ్‌ సింగ్

by Shyam |
టీమిండియాకు ఆ సిరీస్ సవాలే : యువరాజ్‌ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌పై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియాతో పోల్చుకుంటే న్యూజిలాండ్‌కే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌ ఆలోచన మంచిదే. అయితే ఇది సుదీర్ఘ టోర్నీ కాబట్టి ఫైనల్‌ను ఒక్క టెస్ట్‌తో సరిపెట్టకూడదు. మూడు మ్యాచ్‌లు నిర్వహించి వాటిల్లో రెండు గెలిచిన వారిని విజేతగా ప్రకటించాలి. ఇక, ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌ ఫైనల్‌లో భారత్‌తో పోల్చుకుంటే న్యూజిలాండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం భారత్‌కు పెద్ద లోటు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేలోపే ప్రతిష్టాత్మక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇది సవాలుతో కూడుకున్నదే. మరోవైపు న్యూజిలాండ్ అక్కడే ఉండి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. కాబట్టి ఆ టీమ్‌కు అక్కడి పరిస్థితులపై అవగాహన ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.’’ అని యువరాజ్ తెలిపారు.

Advertisement

Next Story