కరోనాపై దాడికి యూవీ ట్రాలీ

by sudharani |
కరోనాపై దాడికి యూవీ ట్రాలీ
X

హెచ్‌సీయూ, మెకిన్స్ ఇండస్ట్రీస్ ఆవిష్కరణ

దిశ, న్యూస్ బ్యూరో :
కొవిడ్ -19ను నివారించడంలో భాగంగా నూతన ఆవిష్కరణలు రూపొందుతున్నాయి. కరోనా టెస్టుల కోసం పేషంట్లకు అత్యాధునిక చికిత్స అందించే విధంగా యంత్ర పరికరాలు కనిపెడుతున్నారు. మరో వైపు కొవిడ్ నివారణలో పరిసరాల పరిశుభ్రత కూడా కీలకమైనదే. ఈ నేపథ్యంలో అల్ట్రా వాయిలెట్ (యూవీ) కిరణాలతో సూక్ష్మ జీవులను నివారించే ట్రాలీ పరికరాన్ని హెచ్‌సీయూ, మెకిన్స్ ఇండస్ట్రీస్ కలిసి రూపొందించాయి. ఆస్పత్రి పరిసరాలను, ఇతర బహిరంగ ప్రదేశాల్లోని క్రిములను వేగంగా నిర్మూలించడం ఈ పరికరం ప్రత్యేకతని.. ఆవిష్కర్తలు వివరించారు. 200 – 300 ఎన్‌ఎం మధ్య తరంగదైర్ఘ్యాల పరిధిలో ఉన్న యూవీ కాంతి ద్వారా గాలి, ఉపరితలాల మీదున్న బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను సంహరిస్తాయి. యూవీ కాంతిని ఉపయోగించి ఆస్పత్రి గదులు, సాధనాలు, ఇతర ఉపరితలాలపై క్రిమిసంహారం చేయడం మంచి పరిష్కారమని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. మాల్స్, హోటళ్లు, కార్యాలయాలు, విమానాశ్రయాలు, రైల్వేలు మొదలైన ప్రాంతాల్లోనూ ఈ ట్రాలీ ద్వారా శుభ్రపరచవచ్చు.

Tags: corona, Tally, HCU, Mekins industries, UV Rays

Advertisement

Next Story

Most Viewed