ధోనీ, కోహ్లీల మద్ధతు లభించలేదు : యువరాజ్

by vinod kumar |
ధోనీ, కోహ్లీల మద్ధతు లభించలేదు : యువరాజ్
X

జట్టులో తనకు ఎదురైన చేదు అనుభవాలను టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి బయటపెట్టాడు. తాను ఆడిన టైంలో కెప్టెన్లుగా ఉన్న గంగూలీ, ధోనీ, కోహ్లీల నుంచి అందిన సహకారంపై ‘స్పోర్ట్స్ స్టార్’ అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ పలు విషయాలను వెల్లడించాడు. టీమ్ ఇండియా కెప్టెన్‌గా గంగూలీ తనకందించిన సహకారం మరువరానిదని అన్నాడు. ‘2000లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తనను గంగూలీ ఎంతో ప్రోత్సహించేవాడని చెప్పుకొచ్చాడు. గంగూలీ కెప్టెన్సీలో 110 మ్యాచులు ఆడానని.. తాను ఏనాడూ ఇబ్బంది పడలేదని చెప్పాడు. గంగూలీతో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నట్లు తెలిపాడు.

అయితే, గంగూలీ, ధోనీలను పోల్చడం చాలా కష్టమని చెప్పాడు. తనకు ధోనీ, కోహ్లీ నుంచి ఎప్పుడూ మద్ధతు లభించలేదన్నాడు. కాగా.. ధోనీ, యువరాజ్ మధ్య మొదటి నుంచి సరైన సఖ్యత లేదు. యువరాజ్ కెరీర్ నాశనం కావడానికి ధోనీనే కారణమని యువీ తండ్రి యోగరాజ్ పలుమార్లు బాహాటంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ వివాదం సద్దుమణిగిన ఇన్నాళ్లకు మళ్లీ యువీ.. ధోనీ ప్రస్తావన తీసుకురావడం గమనార్హం.

Tags: Ganguly, Yuvraj singh, Dhoni, Kohli, Champions trophy

Advertisement

Next Story