పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్ యూనిస్

by Shyam |
పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్ యూనిస్
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్‌లో మరోసారి రాజకీయ ముసలం ఏర్పడింది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్ పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ఎప్పటి నుంచో రాజకీయాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. అక్కడ రిటైర్ అయిన ఎంతో మంది క్రికెటర్లు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తుంటారని ఎంతో మంది బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దాని వల్లే చాలా మంది తమ పదవీ కాలం ముగియక ముందే రాజీనామాలు చేస్తుంటారు.

తాజాగా యూనిస్ ఖాన్ తన బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. అయితే రాజీనామాకు గల కారణాలను మాత్రం అతడు వివరించలేదు. పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం జరుగుతున్న పీఎస్ఎల్ 6 ముగిసిన వెంటనే ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నది. మరికొద్ది రోజుల్లో విదేశీ పర్యటనకు వెళ్లాల్సిన సమయంలో కోచ్ రాజీనామా జట్టుపై ప్రభావం చూపనున్నది. మరోవైపు బ్యాటింగ్ కోచ్ లేకుండానే పాకిస్తాన్ జట్టు విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు పీసీబీ ప్రకటించింది. జూన్ 25 నుంచి ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభం కానున్నది.

Advertisement

Next Story

Most Viewed